ప్రొఫెసర్ జి. ఎన్ సాయిబాబా మృతి పట్ల సిపిఐ( ఎం ) నాయకులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ నందు ప్రోఫెసర్ సాయిబాబా చిత్రపటానికి నివాళుర్పించారు. భౌతికంగా నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమైన ప్రొఫెసర్. చేయని నేరానికి జైల్లో మగ్గిపోయారని అన్నారు. బెయిలుపై విడుదలైన కొద్ది నెలలకే మరణించడం బాధాకరమన్నారు.