ఇంట్లోనే ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం ఆత్మకూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని పాత చెక్పోస్ట్ సమీపంలో నివాసముంటున్న మహబూబ్ బాషా అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలు, అప్పుల బాధ తాళలేక ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు.