పత్తికొండ: చదువుతోనే పిల్లలకు భవిష్యత్తు: జిల్లా ఎస్పీ
బాగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు. గురువారం వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రాథమిక పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చదువుకోకపోవడం వల్లే గతంలో ఫ్యాక్షన్ జాడలు ఏర్పడ్డాయని, ఇప్పుడు మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారన్నారు.