కర్నూలు జిల్లాలో రోజురోజుకు టమాట ధర పడిపోతోంది. పత్తికొండలో కొద్ది రోజుల క్రితం వరకు కిలో టమాట రూ. 33 పలికింది. క్రమంగా తగ్గుతూ వస్తోంది. బుధవారం పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కిలో టమాట గరిష్ట ధర రూ. 22, కనిష్టం రూ. 12, సరాసరి రూ. 17 పలికింది. 563 క్వింటాళ్ల టమాట పంట ఉత్పత్తులను రైతులు యార్డుకు తీసుకొచ్చారు. ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.