వెల్దుర్తి మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న పిలుపునిచ్చారు. శనివారం వెల్దుర్తిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఏఐఎస్ఎఫ్ నాయకులు పర్యటించి, మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై కూటమి ప్రభుత్వం తమ నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.