అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని జై భీం యువత ఫౌండేషన్ అధ్యక్షుడు ఆవుల సోమన్న కోరారు. శుక్రవారం పత్తికొండలో ఆయన ఆర్డీవో ఎస్. భరత్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఫీజుల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారని విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.