పేదకుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాను ఇస్తుందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు అన్నారు. మంగళవారం పత్తికొండ క్యాంపు కార్యాలయంలో పది కుటుంబాలకు రూ. 9. 88 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదల వైద్య ఖర్చులకు టీడీపీ ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు బత్తిని లోక్ నాథ్, ఎస్టీ సెల్ నాయకులు వెంకటపతి ఉన్నారు.