కర్నూలులో ప్రైవేటు మద్యం దుకాణాలు ఎవరిని వరిస్తాయో, ఎవరికి అవకాశం దక్కుతుందో అనే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. సోమవారం కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో దరఖాస్తులను లాటరీ తీసి ఖరారు చేస్తారని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 99 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ కాగా, 3, 046 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఉదయం 7 గంటలకు చేరుకోవాలన్నారు.