నందికొట్కూరు: జగనన్న కాలనీలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలి

68பார்த்தது
నందికొట్కూరు: జగనన్న కాలనీలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలి
నందికొట్కూరు పట్టణంలోని జగనన్న కాలనీలో ఆర్టీసీ బస్సు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుడు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, 5 కి. మీ. వరకు రూ. 10 చార్జీ వసూలు చేయాలని, కానీ ప్రస్తుతం రూ.20 చేస్తున్నారని తెలిపారు. ఆయన, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీ సీఐ సరోజమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమన్న, సాములు, రమణ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி