కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా సోమవారం నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య నందికొట్కూరు మండల పరిధిలోని కోనేటమ్మ పల్లె గ్రామంలో సోమవారం పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీడీవో, ఈవోపీఆర్డి, గ్రామ సర్పంచ్ దామోదర్ అధికారులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.