కల్లుకుంట గ్రామాన్ని సందర్శించిన ఎస్డీపీఓ

50பார்த்தது
కల్లుకుంట గ్రామాన్ని సందర్శించిన ఎస్డీపీఓ
పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మపై జరిగిన దాడి నేపథ్యంలో శనివారం ఎమ్మిగనూరు ఎస్డీపీఓ ఉపేంద్ర బాబు గ్రామాన్ని సందర్శించారు. దళిత కాలనీలో పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్ ను తనిఖీ చేసి పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఇందులో కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி