కోసిగి పట్టణంలోని 4వ వార్డు కొత్తపేట కాలనీకి చెందిన కురువ రాముడు, నాగమ్మ దంపతుల కుమారుడు కురువ శివ(18) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం కోసిగి ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన శివ తమ పొలంలో ఉన్న రేకుల షెడ్డులో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.