కౌతాళం మండలంలోని తుంగభద్ర నది తీరంలో తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు మెళిగనూరు, నదిచాగి, మరళి, గుడికంబాలిలలో రైతులు సాగు చేసిన వరి పంట నేల వాలింది. దీంతో రైతుల అవస్థలు పడుతున్నారు. ఆదివారం తమ వరిమళ్లలో నేల కొరిగిన వరి పంటను జట్లు కట్టి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది తమ వరి పంటను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలన్నారు.