ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సుంకేసుల జలాశయానికి సోమవారం ఉదయం 38, 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో డ్యాం నుంచి 8 గేట్లను ఎత్తి దిగువకు 35, 832 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు, అలాగే కేసీ కెనాల్ కు 2, 265 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 194 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.