కర్నూలు: నకిలీ ఫోన్ పే తో మోసం
ఉయ్యాలవాడ పోస్టుమాన్ గా పనిచేస్తూ ఫేక్ ఫోన్ పే తో మోసాలకు పాల్పడుతున్న ఒక యువకుడిని ఆదివారం కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బి. తాండ్రపాడుకు చెందిన కార్తీక్ ఉయ్యాలవాడలో పోస్ట్ మెన్ గా పని చేస్తున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇతను ఏటీఎం సెంటర్ల వద్ద అత్యవసరం ఉంది. డబ్బులు ఇస్తే ఫోన్ పే చేస్తానని చెప్పి బురిడీ కొట్టిస్తున్నాడు. బాధితులు తర్వాత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.