ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన బైరి ప్రసాదం, నాగేళ్ల సునీల్ అనే ఇరువురు మద్యం సేవించి వాహనాలు అతివేగంగా నడుపుకుంటూ వస్తుండగా వారిపై ఉయ్యాలవాడ స్టేషన్ లో కేసు బుధవారం నమోదు చేశారు. కోవెలకుంట్ల జడ్జి దగ్గర హాజరు పరచగా కోయిలకుంట్ల జడ్జి షేక్ అబ్దుల్ రెహమాన్ వారికి ఒక్కొక్కరికి 30 రోజులు జైలు శిక్ష, ఐదు వేల రూపాయలు జరిమానా విధించడం జరిగిందని ఎస్సై రామాంజనేయరెడ్డి తెలిపారు.