ఆళ్లగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఈనెల 9 న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి కౌన్సిల్ బృందం పాల్గొంటున్నట్లు తెలిపారు.