ఆదోని యూటీఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మండల అధ్యక్షులు గాదిలింగప్ప అధ్యక్షత న మహాసభ జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు జీవిత, కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందని వారు తెలిపారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, బోధనేతర కార్యక్రమాలో భాగస్వామ్యం చేస్తుందని, పారదర్శకత పేరుతో వివిధ యాప్ లను ప్రవేశపెట్టి ఉపాధ్యాయులకు పనిభారం పెంచుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితము చేయాలని లేకుంటే యూటీఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని తెలిపారు.