ఆదోని పట్టణంలోని గణేశ్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న ఎరుకల రామన్న కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వెంటనే స్పందించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా నాయకులు సునీల్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పార్థసారథి రామన్న కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. దాడికి పాల్పడిన నిందితులకు శిక్ష పడే విధంగా ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి చొరవ చూపాలని వారు కోరారు.