కౌతాళం మండలం చాలా వెనుకబడిన ప్రాంతమని, ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు తీర్చడానికి ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వలసలు పోతున్నారని, అందుకు తుంగభద్ర నదిపై వరద కాలువ నిర్మించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య సోమవారం టీడీపీ నేత ఉలిగయ్యకు వినతిపత్రం అందజేశారు. మండలంలో ఎల్లెల్సీ, తుంగభద్ర నది ప్రవహిస్తున్నా రైతులకు ఉపయోగం లేదన్నారు.