గూడూరులో మణికంఠ వైన్స్ షాపును తొలగించాలి
గూడూరు నగర పంచాయతీలో నిర్వహిస్తున్న మణికంఠ వైన్స్ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు, పాలక మండలి సభ్యులు కమిషనర్ నాగరాజుతో కలిసి మున్సిపల్ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు శనివారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడారు. నిత్యం రద్దీగా ఉండి, గృహా సమూదాల మధ్య ఏర్పాటు చేసిన మణికంఠ వైన్స్ షాపును తొలగించి, మరో ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.