తుంగభద్ర నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. బుధవారం ఎగువ నుంచి సుంకేసుల బ్యారేజీకి 48, 890 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఇందులో కేసీ కెనాల్ కు 1540 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 11 బ్యారేజీ గేట్లు పైకెత్తి దిగువకు 47, 047 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన తుంగభద్ర డ్యాంకి ఈనెల 4వ తేదీ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.