సంక్షేమ పథకాల పంపిణీలో వివక్షత చూపొద్దు

82பார்த்தது
సంక్షేమ పథకాల పంపిణీలో వివక్షత చూపొద్దు
ఆదోని పట్టణంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో మాదిగ కులాలు అధిక సంఖ్యలో ఉన్నారని, దళిత, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించడంలో అధికారులు వివక్షత చూపరాదని కోరారు. దళితుల హక్కుల సాధనకు జై భీమ్ ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி