టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్రమైన విమర్శలు చేసిన వైసిపి నాయకుడు పోసాని కృష్ణ మురళిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సోమవారం టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించి డీఎస్పీకి ఫిర్యాదు సమర్పించారు.