ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు గురువారం మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రేపు శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య మొదటి రోజు కంటే రెండో రోజు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో పున్నమి ఘాటు వద్దనే వాహనాలను నిలిపివేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీస్ అధికారులు ముందస్తు చర్యలో భాగంగా ట్రాఫిక్ ను నియంత్రణ చేస్తున్నారు.