పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం దావులూరు, ప్రొద్దుటూరు గ్రామాలలో గురువారం రైతులు సౌకర్యార్థం పొలంబడిని నిర్వహించారు. పంటలలో సస్యరక్షణ చర్యలపై రైతులకు సూచనలు ఇచ్చారు పూతలో పురుగుకు 100ఎంఎల్ ని ఎకరానికి వాడాలని మినుము పంటకు ఎరపంటగా బంతి లేదా కంది పంటలను వేసుకోవాలని మండల వ్యవసాయధికారి కిరణ్ సూచించారు.