రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సోమవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అకడమిక్ కేలండర్లో ఐచ్చికంగా ఉన్న సాయంత్రం 4నుంచి5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసిందని ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9నుంచి సాయంత్రం 4వరకు కాగా దీన్ని 5 గంటల వరకు పెంచిందని మంత్రి తెలిపారు.