పూల వ్యాపారి పిచ్చయ్య మృతిపై అసత్య ప్రచారం చేసిన కంకిపాడుకు చెందిన వాట్సాప్ గ్రూపు అడ్మిన్ కోనా కిషోర్, ఛానల్ రిపోర్టర్ ప్రదీప్ పై ఆదివారం కేసు నమోదు చేశారు. తనపై ఇద్దరు అసత్య ప్రచారం చేసినట్టు పెనమలూరు నియోజకవర్గం జనసేన నేత ముప్పా రాజా పోలీసులకు పిర్యాదు చేశాడు. దానిపై కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.