నవంబర్ 10వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ధన్వంతరి జయంతోత్సవాలను విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు తెన్నేటి ప్రకాష్ పిలుపునిచ్చారు. బుధవారం పెనమలూరులో ఆయన మాట్లాడుతూ, ఆదివారం జరిగే ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులు తరలివస్తున్నారని, అలాగే ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులు పాల్గొంటారని తెలిపారు.