ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఒగిరాల తండాలో ఎక్సైజ్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 800లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు. అలాగే ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటుసారా తయారుచేసిన, అమ్మిన, కలిగి ఉన్న కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.