నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు గురువారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న జీతాలు విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ జమ చేయాలని మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పూదోట ప్రకాష్ డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్మికులతో పాటు వీరిని ఆప్కాస్‌లో విలీనం చేయాలన్నారు.