ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 11మంది వ్యక్తులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శుభ శేఖర్ తెలిపారు. మండలంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.