మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెడుతూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీకి దివంగత వైఎస్ఆర్ పేరు పెట్టగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దీన్ని వ్యతిరేకించింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి వినతి మేరకు మెడికల్ కాలేజీకి పింగళి పేరు పెడతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.