మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ భక్తజన సందోహంగా మారింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు శక్తి పటాల ఊరేగింపులు వీక్షించేందుకు యువకులు, భక్తులు పలు గ్రామాల్లో నుంచి ప్రజలు తరలి రావడంతో కోనేరు సెంటర్ కిక్కిరిసింది. వందలాది వాహనాల్లో శక్తి పటాలు తీసుకుని వస్తుండగా భక్తులు అమ్మవారిని స్తుతిస్తూ తన్మయులయ్యారు.