కృష్ణాజిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ నియమితులయ్యారు. రాష్ట్ర బీమా వైద్య సేవల మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ ను జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం జరిగింది. సుభాష్ ను నియమించడం పట్ల పలువురు జిల్లా స్థాయి నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు.