ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్ట్ గా కలిదిండి మండలం మట్ట గుంట గ్రామానికి చెందిన తెదేపా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావుకు మంగళవారం చోటు దక్కింది. శ్రీనివాసరావు తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సామాజికవర్గ ఉన్నతికి నిరంతరం పాటుపడుతున్న అండ్రాజుకు తగిన గుర్తింపు దక్కిందని గ్రామస్తులు తెలిపారు.