కొల్లేటి ప్రజల సమస్యలను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీనివాస వర్మను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ఆయనను విజయవాడలో కలిసి సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కొల్లేటి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, ఆక్వా రైతాంగానికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.