అధికారులు, నాయకులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ , పంచాయతీ రాజ్ , ఆరోగ్య, ఐసిడిఎస్ , గ్రామీణ నీటిపారుదల శాఖ తదితర అధికారులు తమ శాఖ ప్రగతిని గూర్చి వారు అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామలింగేశ్వరావు పాల్గొన్నారు.