జగ్గయ్యపేట పట్టణం యొక్క పరిశుభ్రత, సౌందర్యాన్ని కాపాడే ప్రయత్నంలో అన్ని అనధికార ఫ్లెక్స్ బోర్డులు, పోస్టర్లు తొలగింపునకు శ్రీకారం చుట్టామని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మంగళవారం తెలిపారు. ఈనెల 13వ తారీకు లోపు అనధికార ఫ్లెక్స్ బోర్డులు, బ్యానర్లు లేదా హోర్డింగ్లను తొలగించాలని తొలగించనిచో 14 అక్టోబర్ 2024 నుండి వాటిని తొలగించడానికి మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.