జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్నిప్రారంభించారు. పెనుగంచిప్రోలు గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య చొరవతో విజయవాడ స్రవంతి హాస్పటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.