అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై ఆటంకాలు ఎదురైతే తన దృష్టికి తీసుకుని రావాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికార యంత్రాంగానికి సూచించారు. నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.