కోడూరు మండలంలోని అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గేట్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరి తీవ్రంగా నష్టపోతున్నామని ఆదివారం పలువురు రైతులు ఆరోపించారు. ఇటీవల ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులు గేట్లు మరమ్మతులకు గురైన చోట ఇసుక మూటలు వేశారు. అనంతరం తొలగించడంతో ప్రస్తుతం అల్పపీడన కారణంగా సముద్రపు నీరు పంట పొలాల్లోకి వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.