అవుట్ పాల్స్ స్లూయిస్ గేట్లు సరిగా లేనందున సముద్రపు ఉప్పునీటి ముంపుకు గురై నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని కోడూరు మండల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కోడూరు ఈస్ట్ ఛానల్ 13, 14, 15 , 16 , 17, 18 కాల్వల కింద ఉప్పు ముంపుకు గురై నష్టపోయిన రైతులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోడూరు మండల తహసిల్దార్ శ్రీను నాయక్ వినతి పత్రం అందించారు.