కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి చల్లపల్లి మండలం నడకుదురులోని ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృద్వీశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం అత్యంత శోభాయమానంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థాన సమగ్ర అభివృద్ధి కర్త మండవ రవీంద్ర, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు విచ్చేసి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.