మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ నియోజకవర్గాన్ని అణువణువునా దోచుకున్నారని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసిపి ప్రభుత్వంలో ఇసుక, బుసక, మట్టి అక్రమ రవాణాకు పాల్పడింది మీరు కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.