ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో గల ఇబ్రహీంపట్నం పరిధిలో 20 ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నారు. సోమవారం గుంటుపల్లి, చిన్న లంక గ్రామాల్లో కోడిపందాలు నిర్వహిస్తున్న సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ మెరుపు దాడిలో కోడిపందెల రాయుళ్లు తమ వాహనాలను అక్కడ వదిలివేయడంతో పోలీసులు వాటిని స్వాధీనపరచుకొని ట్రాక్టర్ సహాయంతో పోలీసు స్టేషన్ కు తరలించారు.