కృష్ణా: వైసీపీ షాకింగ్ డెసిషన్.. ఎన్నికలకు దూరం!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. "కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే బహిష్కరిస్తున్నాం" అని వైసీపీ నేత పేర్ని నాని స్పష్టం చేశారు.