ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు ఐదో రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారు సోమవారం మహా చండి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. ఉదయం నుండి క్యూ లైన్ లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సోమవారం అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గటంతో క్యూలైన్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.