నందిగామ పట్టణ పరిధిలోని రామలింగేశ్వర స్వామి రధశాల నిర్మాణానికి శనివారం స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. అనంతరం రధశాల శాశ్వతంగా భద్రపరచడానికి సొంత నిధులు 10 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్న మురళి రాఘవ కుమార్ కు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.