వైసీపీలో సభ్యత్వాలు ఉన్నాయా ఆ విధానం ఉన్నట్లు తనకు తెలియదని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీలో చేరాం, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను కానీ సభ్యత్వం ఎవరూ ఇవ్వలేదని, ఇచ్చిన వ్యక్తి కూడా లేడని తెలిపారు. టీడీపీలోనే సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డు, బీమా సౌకర్యం కల్పించే విధానం టీడీపీలోనే ఉందన్నారు.